మున్సిపల్ ఎన్నికలు – నామినేషన్‌ల దాఖలు వివరాలు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్


మున్సిపల్ ఎన్నికలు – నామినేషన్‌ల దాఖలు వివరాలు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల దాఖలు ప్రక్రియ కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అశ్వరావుపేట మున్సిపాలిటీ, ఇల్లందు మున్సిపాలిటీ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా, మొత్తం 106 వార్డులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అశ్వరావుపేట మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను ఇప్పటివరకు 3 నామినేషన్‌లు దాఖలైనట్లు తెలిపారు. వీటిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి 2, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి 1 నామినేషన్ ఉన్నట్లు వెల్లడించారు. 

ఇల్లందు మున్సిపాలిటీలోని 24 వార్డులకు గాను ఇప్పటివరకు 1 నామినేషన్ దాఖలైందని, అది బీజేపీ తరఫున నమోదు అయ్యిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 వార్డులకు గాను ఇప్పటివరకు 3 నామినేషన్‌లు దాఖలైనట్లు పేర్కొన్నారు. వీటిలో బీఆర్‌ఎస్ నుంచి 2, స్వతంత్ర అభ్యర్థి నుంచి 1 నామినేషన్ ఉన్నట్లు తెలిపారు.

మొత్తంగా జిల్లాలో ఇప్పటివరకు 7 నామినేషన్‌లు దాఖలయ్యాయని, అందులో బీజేపీ – 3, బీఆర్‌ఎస్ – 3, స్వతంత్ర అభ్యర్థులు – 1 కాగా, ఇతర రాజకీయ పార్టీల నుంచి ఇప్పటివరకు ఎటువంటి నామినేషన్‌లు దాఖలుకాలేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ జనవరి 30, 2026 సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు అవసరమైన పత్రాలతో నామినేషన్‌లు దాఖలు చేయాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు.


Blogger ఆధారితం.