టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ను సన్మానించిన 42వ డివిజన్ కార్పొరేటర్ మణి

 

టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ను సన్మానించిన 42వ డివిజన్ కార్పొరేటర్ మణి

కొత్తగూడెం: 42వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్ దున్నపోతుల మణి రవికుమార్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములును ఘనంగా సన్మానించారు.

విద్యానగర్‌లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా మణి రవికుమార్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి నాగా సీతారాములు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకమని అన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కొత్తగా పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలపరచాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Blogger ఆధారితం.