రంజాన్ మాసంలో సేవా కార్యక్రమం: కూల్ వాటర్ ఫ్రీజర్ ప్రారంభం
రామగుండం: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రామగుండం టెమ్రీస్ బాలుర పాఠశాల–1లో కూల్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీజర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ రామగుండం కార్పొరేషన్ మండల ఇంచార్జ్, టెమ్రీస్ కౌన్సెలర్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథిగా టెమ్రీస్ కౌన్సెలర్ ఆయేషా సిద్ధిఖ హాజరయ్యారు.
ఇస్తేక్‌బాల్-ఏ-రంజాన్ కార్యక్రమం సందర్భంగా దంపతులు రిబ్బన్ కట్ చేసి డ్రింకింగ్ వాటర్ ఫ్రీజర్‌ను ప్రారంభించారు. రంజాన్ మాసంలో ఉపవాసం పాటించే విద్యార్థులు, సిబ్బందికి చల్లని త్రాగునీరు అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు సమాజంలో సౌహార్దాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, వార్డెన్ ఇస్మాయిల్ సార్, మౌలానా నిజాముద్దీన్ (ఇమామ్ వ ఖతీబ్ – మసీదు రామగుండం), బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో చేపట్టిన ఈ సదుపాయం విద్యార్థులకు ఎంతో మేలు చేయనుందని నిర్వాహకులు తెలిపారు.

Post a Comment