చట్టి షరీఫ్ మార్చి 26న సిద్ధమైన ఖాన్ఖాయే గరీబ్ నవాజ్ చిల్లా షరీఫ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఖాన్ఖాయే గరీబ్ నవాజ్, చిల్లా షరీఫ్‌లో ప్రతి నెల చట్టి షరీఫ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి నెల భక్తి శ్రద్ధలతో జరిగే ఈ ఉత్సవాలకు స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఈ సందర్భంగా ఖాన్ఖాయే గరీబ్ నవాజ్ చిల్లా షరీఫ్ ఖాదీమ్ సయ్యద్ ఫకీర్ అహ్మద్ చిస్తీ విడుదల చేసిన ప్రకటనలో, మార్చి 26వ తేదీ గురువారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు, ఫతేహ ఖానీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
చట్టి షరీఫ్ సందర్భంగా దర్గా పరిసర ప్రాంతాన్ని శుభ్రపరిచి, విద్యుత్ అలంకరణలు, నీటి సౌకర్యాలు వంటి ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమంలో పాల్గొనేలా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ పవిత్ర ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, ప్రార్థనల్లో పాల్గొని, తీర్థప్రసాదాలను స్వీకరించాలని ఖాదీమ్ సయ్యద్ ఫకీర్ అహ్మద్ చిస్తీ కోరారు. భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ కార్యక్రమం శాంతి, సౌభ్రాతృత్వాన్ని మరింత బలపరుస్తుందని ఆయన తెలిపారు.

Post a Comment