సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకోవాలి నాగా సీతారాములు
కొత్తగూడెం: నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్యమార్గాలను బోధించిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకుని సమాజం ముందుకు సాగాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపునిచ్చారు.
ఎదురుగడ్డలో ఆదివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ 287వ జయంతి ఉత్సవాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జేఎసి ఛైర్మన్ లక్ష్మణ్ నాయక్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. వివాహం చేసుకోకుండా సమాజ సేవకే జీవితాన్ని అంకితం చేసి, బంజారాల్లో మూడు నమ్మకాలపై అవగాహన కల్పించిన గొప్ప సంస్కర్తగా ఆయనను అభివర్ణించారు. గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, మాజీ సొసైటీ అధ్యక్షులు మండె వీరహనుమంతరావు, కార్పొరేటర్లు స్వప్న, నగేష్, సర్పంచులు గుగులోతు బాబు, అరుణ్, వీరన్న, లైలా, నాయకులు బోజ్యా నాయక్, అర్జున్ రావు, వశ్యా నాయక్, విజయలక్ష్మీ, జేఎసి నాయకులు రమేష్, ప్రసాద్, యువ నాయకుడు విఘ్నేష్, డాక్టర్లు వెంకన్న, బిందుశ్రీతో పాటు మతపెద్దలు, మహిళలు, యువకులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Post a Comment