హోలీ సందర్భంగా వైన్ షాపులు, బార్ల మూసివేత
మార్చి 02, 2026: హోలీ పండుగ సందర్భంగా నగరంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేలా G. Sudheer Babu, IPS గారు సంబంధిత శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Future City Police Commissionerate పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు (Toddy Shops) మరియు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు 03-03-2026 (మంగళవారం) ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పూర్తిగా మూసివేయబడతాయి. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు మరియు రిజిస్టర్డ్ క్లబ్‌లలో నిర్వహించే బార్లకు ఈ ఆదేశాలు వర్తించవు అని స్పష్టం చేశారు.
ప్రజలు ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో Telangana Excise Act – 1968 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు ప్రజలకు సహకరించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment