సమ్మక్క సారాలమ్మలను దర్శించుకున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
ములుగు : తెలంగాణలో ఆదివాసీల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ జాతర తల్లులను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు తన అనుచరులు, పార్టీ నాయకులతో కలిసి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేశారు. తల్లుల ఆశీస్సులు రాష్ట్రానికి ఎల్లప్పుడూ కాపాడాలని, ప్రతి కుటుంబంలో ఆనందం నెలకొనాలని కోరుకున్నారు.
దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన నాగా సీతారాములు, సమ్మక్క సారలమ్మ తల్లులు ఆదివాసీ సమాజానికి మాత్రమే కాకుండా మొత్తం తెలంగాణ ప్రజలకు ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. తల్లుల దయతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
అలాగే “ఇందిరమ్మ రాజ్యం”లో ప్రతి ఒక్కరూ శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తల్లుల దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

Post a Comment