నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలి: HMS & జాగృతి పిలుపు
మణుగూరు, ఏప్రిల్ 20: ఈ నెల 25న నిర్వహించనున్న తెలంగాణ జాగృతి నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని హెచ్‌ఎంఎస్ (HMS) నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మణుగూరులోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో హెచ్‌ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత మాట్లాడుతూ, తెలంగాణలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా జాగృతి ముందుకు సాగుతోందన్నారు. సింగరేణి సంస్థలో మార్పులు తీసుకురావడంలో జాగృతి-HMS కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ నెల 25న కవితక్క నూతన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపారు. ఆ తర్వాత సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ఈ పార్టీ అండగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మణుగూరు ఏరియాకు చెందిన సింగరేణి కార్మికులు మాత్రమే కాకుండా, అన్ని ఏరియాల కార్మికులు కుటుంబ సమేతంగా హాజరై ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ సెంట్రల్ నాయకులు సంజీవ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్లయ్య, ఫిట్ సెక్రటరీ థామస్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి పవన్ నాయక్, జిల్లా అధ్యక్షుడు డి. వీరన్న, జాగృతి విద్యా విభాగం అధ్యక్షుడు లకవత్ సురేష్, జిల్లా నాయకులు రవి, శివకృష్ణ, కార్తీక్, జీవన్, ముభిన్, సాయి, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment