ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ కార్యదర్శుల సాధారణ బదిలీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల సాధారణ బదిలీలు శనివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి విద్యాచందన ఆధ్వర్యంలో ఈ బదిలీల ప్రక్రియ నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 131 మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా, అందరికీ వారు కోరుకున్న స్థానాల్లోనే బదిలీలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
బదిలీల వివరాలు పరిశీలిస్తే గ్రేడ్-1 కార్యదర్శులు ఇద్దరు, గ్రేడ్-2 కార్యదర్శులు నలుగురు, గ్రేడ్-3 కార్యదర్శులు నలుగురు, గ్రేడ్-4 కార్యదర్శులు 121 మంది ఉండగా, మొత్తం 131 మంది కార్యదర్శులకు బదిలీలు పూర్తిచేశారు.
పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బదిలీల ప్రక్రియను నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. కార్యదర్శుల అభిరుచులకు అనుగుణంగా స్థానాల కేటాయింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి సుదీర్ కుమార్, DRDA APO శ్రీనివాసరావు, APD రమణారావు, AVO సునీల్ కుమార్, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది విజయ్, విక్రమ్, ఫరూక్, దుర్గాప్రసాద్‌తో పాటు కార్యదర్శుల సంఘ ప్రతినిధులు వంశీ, సతీష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment