తెలంగాణలో 124 ఎంపీడీవో పోస్టులు ఖాళీ
తెలంగాణలో 124 ఎంపీడీవో పోస్టులు ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 124 మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఈ మేరకు మల్టీజోన్-1, మల్టీజోన్-2 పరిధిలోని జిల్లాలు, మండలాల వారీగా ఖాళీల జాబితాను విడుదల చేసింది.
అత్యధిక ఖాళీలు ఉన్న జిల్లాలు:
నల్గొండ జిల్లా – 9 పోస్టులు
కామారెడ్డి జిల్లా – 7 పోస్టులు
సిద్దిపేట జిల్లా – 7 పోస్టులు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా – 7 పోస్టులు
రంగారెడ్డి జిల్లా – 6 పోస్టులు
నిర్మల్ జిల్లా – 6 పోస్టులు
మల్టీజోన్-1 పరిధిలోని జిల్లాలు
ఆదిలాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హనుమకొండ జిల్లా, జగిత్యాల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కామారెడ్డి జిల్లా, కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, మెదక్ జిల్లా, ములుగు జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లా.
మల్టీజోన్-2 పరిధిలోని జిల్లాలు
జనగామ జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్‌కర్నూల్ జిల్లా, నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లా, సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలు ఉన్నాయి.
ఈ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం త్వరలో తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Post a Comment