కాశీ యాత్రకు వెళ్తూ బస్సు ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
కాశీ యాత్రకు వెళ్తూ బస్సు ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం ప్రాంతం నుంచి కాశీ యాత్రకు బయలుదేరిన యాత్రికుల బస్సు బీహార్‌లో ప్రమాదానికి గురైంది.
బీహార్ రాష్ట్రంలోని Aurangabad సమీపంలో బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.
బస్సులో మొత్తం 43 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది నెల్లూరు జిల్లా సంగం, ఆత్మకూరు, దుత్తలూరు ప్రాంతాలకు చెందినవారు.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. 🙏

Post a Comment