కాలేజీ బస్సు–కారు ఘోర ఢీ.. త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం
కాలేజీ బస్సు–కారు ఘోర ఢీ.. త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం
రాజోలు: మండలంలోని చింతలపల్లి–కలింగుల సమీప జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం వైపు సుమారు 50 మంది విద్యార్థులతో వెళ్తున్న శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ బస్సు ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారును బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం తీవ్రతకు ఢీకొన్న శబ్దంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బస్సులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉండటంతో కాసేపు భయాందోళన నెలకొంది. అయితే అదృష్టవశాత్తూ బస్సులోని విద్యార్థులు, సిబ్బంది, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న రాజోలు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment