పదో తరగతి పరీక్షలో డమ్మీ అభ్యర్థితో పరీక్ష రాయించిన కేసు: ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష

 

పదో తరగతి పరీక్షలో డమ్మీ అభ్యర్థితో పరీక్ష రాయించిన కేసు: ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష

పదో తరగతి పరీక్షలో డమ్మీ అభ్యర్థితో పరీక్ష రాయించిన కేసు: ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష

కొత్తగూడెం: పదో తరగతి పబ్లిక్ పరీక్షలో అసలు అభ్యర్థికి బదులుగా డమ్మీ అభ్యర్థితో పరీక్ష రాయించిన కేసులో ఇద్దరు నిందితులకు కొత్తగూడెం కోర్టు జైలు శిక్ష విధించింది. కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  కె. సాయి మంగళవారం తీర్పు వెలువరిస్తూ నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించారు.

కేసు వివరాల ప్రకారం, 2019 నవంబర్ 4న నిర్వహించిన పదో తరగతి సోషల్ స్టడీస్ పబ్లిక్ పరీక్ష సందర్భంగా కొత్తగూడెంలోని లిటిల్ బర్డ్స్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించిన స్క్వాడ్ అధికారులు అసలు అభ్యర్థి తెల్లం అనిల్ స్థానంలో పూనెం సందీప్ పరీక్ష రాస్తున్నట్లు గుర్తించారు. హాల్ టికెట్‌ను పరిశీలించగా అక్రమం జరిగినట్లు నిర్ధారణ కావడంతో, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కుసుమ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అప్పటి కొత్తగూడెం టౌన్ ఎస్సై పి. రామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సేకరించిన ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, పత్రాలను పరిశీలించిన కోర్టు నిందితులపై అభియోగాలు రుజువయ్యాయని నిర్ధారించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం–1997లోని సెక్షన్ 8 కింద ముగ్గురు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 419 కింద మరో ఏడాది జైలు శిక్ష కూడా విధించింది. అయితే రెండు శిక్షలను ఏకకాలంలో (Concurrent) అనుభవించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నార్సింగ్ అనిల్ కుమార్ వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ అధికారి ఎస్సై డి. రాఘవయ్య (కోర్టు డ్యూటీ ఆఫీసర్), డి. కామేశ్వరరావు సమన్వయం అందించారు.

Blogger ఆధారితం.