భార్య ముక్కు కోసిన భర్త.. ప్రతీకారంగా సోదరి ముక్కు కోసిన బంధువులు
భార్య ముక్కు కోసిన భర్త.. ప్రతీకారంగా సోదరి ముక్కు కోసిన బంధువులు
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో కుటుంబ కలహం దారుణ పరిణామాలకు దారితీసింది. బంధువుల పెళ్లికి వెళ్లాలనే విషయంపై భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు ఇద్దరు మహిళల ముక్కులు కోయబడే స్థాయికి చేరింది.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రీతి అనే మహిళ తన పుట్టింటి బంధువుల వివాహానికి వెళ్లాలని పట్టుబట్టగా, ఆమె భర్త శ్రావణ్‌తో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన శ్రావణ్ పదునైన వస్తువుతో భార్య ముక్కును కోసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన విషయం తెలుసుకున్న ప్రీతి బంధువులు తీవ్ర ఆవేశానికి లోనై, ప్రతీకారంగా శ్రావణ్ సోదరి మోనిపై దాడి చేశారు. ఆమె ముక్కును పళ్లతో కొరికి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం.
ఘటనపై ఇరుపక్షాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. గాయపడిన ఇద్దరు మహిళలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment