పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై యశోదా ఆసుపత్రిలో ఆరా తీసిన కేసీఆర్

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై యశోదా ఆసుపత్రిలో ఆరా తీసిన కేసీఆర్

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై యశోదా ఆసుపత్రిలో ఆరా తీసిన కేసీఆర్

సికింద్రాబాద్, జూలై 27: తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సోమవారం ఆసుపత్రికి వెళ్లారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డికి అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న కేసీఆర్, ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను కోరుతూ, "ఎంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి" అంటూ చేతులెత్తి నమస్కరించినట్లు సమాచారం.

అనంతరం ఆసుపత్రిలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా ఆయన భార్య, పిల్లలను పరామర్శించిన కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. "దేవుడున్నాడు.. డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు.. ధైర్యంగా ఉండండి" అంటూ కుటుంబ సభ్యులకు ఆయన భరోసా కల్పించారు.

కేసీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకుని సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Blogger ఆధారితం.