ప్రియమైన కాక్రోచెస్‌కు అభినందనలు'.. ప్రకాశ్ రాజ్ ఎక్స్ పోస్ట్ వైరల్

 

ప్రియమైన కాక్రోచెస్‌కు అభినందనలు'.. ప్రకాశ్ రాజ్ ఎక్స్ పోస్ట్ వైరల్

'ప్రియమైన కాక్రోచెస్‌కు అభినందనలు'.. ప్రకాశ్ రాజ్ ఎక్స్ పోస్ట్ వైరల్

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నీట్ పరీక్ష అంశంపై జరిగిన ఉద్యమానికి, దానికి మద్దతుగా నిలిచిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు దేశ యువతను అభినందిస్తూ ఆయన ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో సాగిన పోరాటాన్ని ప్రస్తావించిన ప్రకాశ్ రాజ్, "ఒక నిరంకుశ పాలనను సైతం సామాన్యులు మోకాళ్లపై కూర్చోబెట్టగలరని మీరు నిరూపించారు. నా ప్రియమైన 'కాక్రోచెస్' (బొద్దింకలు)కు అభినందనలు" అని పేర్కొన్నారు. అలాగే "ప్రియమైన సోనమ్ వాంగ్‌చుక్ సర్‌, యువత పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ తన సందేశాన్ని కొనసాగించారు.

తనకు ప్రత్యేక గుర్తింపుగా మారిన #JustAsking హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఈ పోస్టుకు జత చేశారు. ప్రభుత్వాన్ని, అధికారాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ ఉద్యమం మరోసారి స్పష్టంగా చాటిచెప్పిందని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యార్థులు, యువత ఐక్యంగా పోరాడితే ఎంతటి శక్తినైనా ప్రశ్నించవచ్చని ఈ పరిణామం నిరూపించిందని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా, ప్రకాశ్ రాజ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

Blogger ఆధారితం.