మేయర్ ఉమారాణిని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

మేయర్ ఉమారాణిని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

మేయర్ ఉమారాణిని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని కసాబ్ గల్లీ (49వ డివిజన్)లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  కూరగాయల ఉమారాణిని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గురువారం పరామర్శించారు.

ఇటీవల మేయర్ ఉమారాణి మాతృమూర్తి పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కసాబ్ గల్లీలోని మేయర్ నివాసానికి వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్.. ఉమారాణి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మాతృమూర్తి మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మేయర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.