ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి బావిలో కారు బోల్తా.. వృద్ధురాలు మృతి

 

ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి బావిలో కారు బోల్తా.. వృద్ధురాలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి బావిలో కారు బోల్తా.. వృద్ధురాలు మృతి

హనుమకొండ, ఆగస్టు 27: భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామ శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నీళ్లు లేని బావిలో పడిపోవడంతో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరై కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న నీళ్లు లేని బావిలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏలూరి రాధమ్మ (70) టైర్ల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంతో బావిలోకి దిగి కారులో చిక్కుకున్న రవీందర్ రెడ్డి, వీరారెడ్డి, కిరణ్‌లను బయటకు తీసుకొచ్చారు.

తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. వివాహ వేడుకకు వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో బొమ్మకల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.