జగన్నాధపురం సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఛార్జింగ్
జగన్నాధపురం సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఛార్జింగ్
ఓవర్‌హాలింగ్ పనులు పూర్తి.. విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పాల్వంచ రూరల్ ఆపరేషన్ సెక్షన్‌కు చెందిన జగన్నాధపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ సామర్థ్యం గల పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గురువారం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గొట్టిముక్కల మహేందర్ విజయవంతంగా ఛార్జ్ చేశారు. ఓవర్‌హాలింగ్ పనులు పూర్తి చేసిన అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌ను తిరిగి విద్యుత్ సేవల్లోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎస్‌ఈ మహేందర్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ అందుబాటులోకి రావడంతో సంబంధిత ప్రాంతంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ చర్య దోహదపడుతుందని పేర్కొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్‌ను ఛార్జ్ చేసే సమయంలో దాని పనితీరు, రక్షణ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా పరిస్థితులను అధికారులు సమగ్రంగా పర్యవేక్షించారు. ఓవర్‌హాలింగ్ అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా పునరుద్ధరించడం ద్వారా సబ్‌స్టేషన్ నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు విద్యుత్ సరఫరాలో విశ్వసనీయత పెరుగుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈ/ఎం అండ్ సీ/కేజీఎం, డీఈ/ఆపరేషన్స్/పీవీసీ, ఏడీఈ/ప్రొటెక్షన్ అండ్ టీఆర్‌ఈ, ఏడీఈ/ఆపరేషన్స్, ఏఈ/ప్రొటెక్షన్, ఏఈ/ఆపరేషన్స్‌తో పాటు సంబంధిత ఓ అండ్ ఎం, ఎంఆర్‌టీ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment