లక్ష్మాపూర్ విజయదుర్గ రైస్ మిల్లులో రూ.65 లక్షల విలువైన ధాన్యం మాయం

 

లక్ష్మాపూర్ విజయదుర్గ రైస్ మిల్లులో రూ.65 లక్షల విలువైన ధాన్యం మాయం

లక్ష్మాపూర్ విజయదుర్గ రైస్ మిల్లులో రూ.65 లక్షల విలువైన ధాన్యం మాయం

రైస్ మిల్‌పై సివిల్ సప్లై అధికారుల కేసు నమోదు

రామాయంపేట, అక్టోబర్ 5: రామాయంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఉన్న విజయదుర్గ రైస్ మిల్లులో రూ.65 లక్షల విలువైన ధాన్యం మాయమైనట్లు సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. 2022–23 టెండర్‌కు సంబంధించిన ధాన్యాన్ని పరిశీలించేందుకు అధికారులు రైస్ మిల్లును తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సివిల్ సప్లై అధికారి తాటి నరసింహులు తెలిపారు.

తనిఖీల్లో ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించడంతో నిబంధనల ప్రకారం రైస్ మిల్ యాజమాన్యంపై 6-A చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం విషయంలో రైస్ మిల్ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిల్వల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. సుమారు రూ.65 లక్షల విలువైన ధాన్యం మాయం కావడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని తెలిపారు.

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వ ధాన్యం నిల్వలు, రైస్ మిల్లుల నిర్వహణపై అధికారులు మరింత పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Blogger ఆధారితం.