హైదరాబాద్‌లో గంజాయి సాగు గుట్టురట్టు.. బీటెక్ విద్యార్థి అరెస్ట్!

హైదరాబాద్‌లో గంజాయి సాగు గుట్టురట్టు.. బీటెక్ విద్యార్థి అరెస్ట్!


హైదరాబాద్‌లో గంజాయి సాగు గుట్టురట్టు.. బీటెక్ విద్యార్థి అరెస్ట్!

హైదరాబాద్: నగరంలో గంజాయి సాగు చేస్తూ, విక్రయిస్తున్న 22 ఏళ్ల బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి గంజాయి మొక్కలను పెంచుతూ విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మల్కాజిగిరి జోన్ ఎస్‌ఓటీ పోలీసులు, జవహర్‌నగర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో బాలాజీనగర్, సంతోషినగర్ ప్రాంతాల్లో నిందితుడిని పట్టుకున్నారు.

అతడి వద్ద నుంచి రెండు గంజాయి మొక్కలతో పాటు 4 గ్రాముల ఎండిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5 వేల వరకు ఉంటుందని వెల్లడించారు.

బీటెక్ చదువుతున్న విద్యార్థి గంజాయి సాగు చేస్తూ విక్రయాలకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? ఎవరెవరికి విక్రయిస్తున్నాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Blogger ఆధారితం.