తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్… సెప్టెంబర్ 2న తుది ఓటర్ల జాబితా
హైదరాబాద్
: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరపాలని స్పష్టమైన దిశానిర్దేశం రావడంతో ఎన్నికల సంఘం కీలక ఏర్పాట్లు ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 28న వార్డు, పంచాయతీ వారీగా ఓటర్ల జాబితా బయటకు రానుంది. అదే రోజు నుంచి 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 2న ఫోటో ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది.
📌 ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన తేదీలు
- ఆగస్టు 28 : వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల
- ఆగస్టు 29 : జిల్లా స్థాయి సమావేశం రాజకీయ పార్టీలతో
- ఆగస్టు 30 : మండల స్థాయి సమావేశం రాజకీయ పార్టీలతో
- ఆగస్టు 28-30 : అభ్యంతరాల స్వీకరణ
- సెప్టెంబర్ 2 : తుది ఓటర్ల జాబితా విడుదల
సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినా…
తెలంగాణలో సర్పంచ్‌ల పదవీకాలం 2024 జనవరి 31తోనే ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో పంచాయతీ పాలన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఒకటిన్నరేళ్లుగా ఎన్నికలు జరగకపోవడం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
హైకోర్టు దిశానిర్దేశం
స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం జూన్ 25న కీలక తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లోపే గ్రామపంచాయతీ ఎన్నికలు జరపాలని ఆదేశించింది. అలాగే 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సూచించింది.
📢 ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ మొదటి వారంలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Post a Comment