అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలి : CPI
మునిపల్లి : గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల వల్ల మునిపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పత్తి, పేసర, మినుము వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్నో ఆశలతో ఈ ఏడాది మంచి దిగుబడులు వస్తాయని భావించిన రైతులు, కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు.
ఈ సందర్భంలో సీపీఐ మండల కార్యదర్శి ఎం.గంగమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించి, నష్టపోయిన పత్తి, మిరప, పేసర పంట రైతులకు ఎకరాకు రూ.25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాల వలన పంటలు ఎర్రబాలరై రైతుల కష్టాలు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మల్లమ్మ, పుల్లమ్మ, మున్ని బాయ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment