డీఎస్సీ 2025 మెరిట్ జాబితా విడుదల

డీఎస్సీ 2025 మెరిట్ జాబితా విడుదల


ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్సీ–2025 మెరిట్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి విడుదల చేసింది. రాష్ట్ర, జోన్, జిల్లా స్థాయిల వారీగా అన్ని సబ్జెక్టుల ఫలితాలను ప్రకటించినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ మెరిట్ లిస్టులు డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంచబడ్డాయి.

అభ్యర్థులకు సూచనలు

  • జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లు అందజేయబడతాయి.
  • కాల్ లెటర్ పొందిన వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు తప్పనిసరిగా హాజరుకావాలి.
  • హాజరు సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, తాజాగా పొందిన కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు సమర్పించాలి.
  • వెరిఫికేషన్‌కు ముందు సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయడం తప్పనిసరి.
  • సమర్పించాల్సిన పత్రాల చెక్‌లిస్ట్ కూడా డీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

సర్టిఫికెట్ల పరిశీలన

జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి 50మంది అభ్యర్థులకు ఒక అధికారుల బృందం పనిచేయనుంది.

  • కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రెవెన్యూ అధికారులను,
  • దివ్యాంగ ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు వైద్యులను నియమించారు.

ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఒకేసారి మొత్తం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇతర నిబంధనలు

ఒకే అభ్యర్థికి బహుళ ఉద్యోగాలు వచ్చినట్లయితే, అభ్యర్థి ఒక పోస్టును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాతే అతనిని/ఆమెను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాకపోయినా, అవసరమైన అర్హతలు రుజువు చేయలేకపోయినా, తదుపరి మెరిట్‌లో ఉన్న అభ్యర్థికి అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.