సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం


హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలాన్ని అనుసరించిన సుధాకర్ రెడ్డి జీవితాంతం నమ్మిన సిద్ధాంతాల కోసం అవిశ్రాంత పోరాటం చేశారని సీఎం గుర్తుచేశారు.

విద్యార్థి దశ నుంచే పలు ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన, దేశ రాజకీయాల్లో ముఖ్యంగా వామపక్ష రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి అన్నారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన సుధాకర్ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి పోరాడారని పేర్కొన్నారు.

సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణంతో దేశం ఒక గొప్ప ప్రజాస్వామిక వాదిని కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. సుధాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.