పిల్లలు బిక్షాటన చేస్తున్న చేయిస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్

పిల్లలకు బిక్షాటన చేస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్


కరీంనగర్ పట్టణంలో నేడు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, పిల్లలకు బిక్షాటన చేయిస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. మస్జిద్‌లు, దర్గాల వద్ద చిన్నారులను బిక్షాటనకు దింపుతున్న వారిని అదుపులోకి తీసుకుంటూ, వారిని చదువుకు ప్రోత్సహించే చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం, జిల్లా బాల సంరక్షణ అధికారి పర్వీన్ మేడమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ఎం.డి. షబ్బీర్ మాట్లాడుతూ, “సంచార ముస్లిం తెగలలో నిరక్షరాస్యత అధికంగా ఉండటానికి ప్రధాన కారణం పిల్లలను బిక్షాటన చేయించడం. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం” అన్నారు. ఆయన బాల సంరక్షణ అధికారి టీమ్ కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

జిల్లా అధ్యక్షుడు ఎం.డి. దావూద్ మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు షేర్ అలీ ఆదేశాల మేరకు శుక్రవారం రోజు మస్జిద్‌ల వద్ద ప్రత్యేక బృందాలు పని చేశాయని తెలిపారు. “కొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చాం. కొంతమంది పిల్లలను మైనారిటీ హాస్టల్స్‌లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటాం. మారని వారిపై కేసులు నమోదు చేస్తున్నాం” అని వెల్లడించారు.

రాష్ట్ర కోశాధికారి ఎం.డి. షాదుల్లా మాట్లాడుతూ, “పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా భిక్షాటన చేయడం తప్పు. ఇస్లాం మతం కూడా దీనిని నిషేధించింది. శ్రమించి జీవనం గడపాలి. బిక్షాటన చేయిస్తున్న వారు మారకపోతే ప్రభుత్వం అందించే పెన్షన్, రేషన్ కార్డు, గ్యాస్, త్రాగునీరు వంటి సౌకర్యాలను నిలిపివేయాలని మేము అధికారులను కోరతాం” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఉమర్ ఫరూక్, జాయింట్ సెక్రటరీ అజ్మత్, గోరేపాషా, హైదర్, యూనిస్, నయీం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.