పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల కృషి – సీపీ అంబర్ కిషోర్ ఝా

పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల కృషి – సీపీ అంబర్ కిషోర్ ఝా


రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఎస్ఐగా విధులు నిర్వహించిన ఎం. వెంకట్ రెడ్డి (70) అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు భద్రత ఎక్స్గ్రేషియా కింద రూ.8,00,000 చెక్కును రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో మరణించిన ఎఎస్ఐ భార్య శ్రీలతకు అందజేశారు.

ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా, కుటుంబ సభ్యుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా లభించాల్సిన ఇతర ప్రయోజనాలు కూడా తక్షణమే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోలీస్ సిబ్బంది సంక్షేమమే తమ మొదటి కర్తవ్యం అని, విధుల్లో ఉన్న సిబ్బంది కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని సీపీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఓ శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.