ప్రజా భవన్ వద్ద డిపెండెంట్ & ల్యాండ్ లూజర్ ఉద్యోగాలకు ఆర్డర్లు
హైదరాబాద్, టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో డిపెండెంట్ ఉద్యోగాలు మరియు ల్యాండ్ లూజర్ (YTPS) ఉద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ శుక్రవారం ప్రజా భవన్‌లో ఆర్డర్లను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జెన్కో యూనియన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
1104 యూనియన్ తరఫున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే రాజేందర్, జెన్కో అధ్యక్షులు కేశబోయిన కోటేశ్వరరావు, జెన్కో వర్కింగ్ ప్రెసిడెంట్, జెన్కో సెక్రటరీ దుర్గా అశోక్, యాశయ్య, జెన్కో ఆడిషన్ సెక్రటరీ కుశలవ రెడ్డి, పోచంపాడు రాష్ట్ర నాయకులు రఫీ, కృష్ణారెడ్డి, పోచంపాడు సెక్రటరీ నజీర్ తదితరులు పాల్గొని ఉద్యోగావకాశాల కల్పనను స్వాగతించారు.
ఉద్యోగాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వానికి, జెన్కో అధికారులకు ఈ సందర్భంగా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment