70 వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ ఎస్. రాజేష్ కుమార్ లంచం తీసుకుంటూ ఎసీబీ బృందాలకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుని ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి సహాయం చేస్తానని చెప్పి ఆయన నుండి రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసినట్లు ఎసీబీ వెల్లడించింది. ఇందులో భాగంగా **రూ.70,000/-**ను నాగోల్‌కు చెందిన ప్రైవేట్ దస్తావేజు లేఖకుని కార్యాలయంలో పనిచేస్తున్న టైపిస్టు కె. రమేష్ ద్వారా స్వీకరిస్తూ రెడ్ హేండ్ గా దొరికాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎసీబీ, మరిన్ని వివరాలను సేకరిస్తోంది.
🔔 ప్రజలకు ఎసీబీ విజ్ఞప్తి: ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయవచ్చు. అలాగే, వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), లేదా వెబ్‌సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చును.
👉 ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

Post a Comment