మినిమమ్‌ బ్యాలెన్స్‌ బ్యాంకుల ఇష్టం: ఆర్‌బీఐ గవర్నర్‌

మినిమమ్‌ బ్యాలెన్స్‌ బ్యాంకుల ఇష్టం: ఆర్‌బీఐ గవర్నర్‌


బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వల అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా స్పష్టత ఇచ్చారు. “మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఎంత ఉండాలన్నది పూర్తిగా ఆయా బ్యాంకులే నిర్ణయించుకుంటాయి. ఈ అంశం ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు” అని ఆయన వెల్లడించారు. గుజరాత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వివరించారు.

“కొన్ని బ్యాంకులు రూ.10 వేలు నిర్ణయిస్తాయి. మరికొన్ని రూ.2 వేలు ఉంచుతాయి. కొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్‌ నిబంధనే ఎత్తివేస్తాయి. ఇది ఆర్‌బీఐ నిర్దేశించే అంశం కాదు” అని మల్హోత్రా చెప్పారు.

ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్‌ మినిమమ్‌ బ్యాలెన్స్‌ పరిమితిని భారీగా పెంచిన విషయం తెలిసిందే. 2025 ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారికి మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.

  • మెట్రో, అర్బన్‌: రూ.10,000 నుంచి రూ.50,000కు పెంపు
  • సెమీ అర్బన్‌: రూ.5,000 నుంచి రూ.25,000కు పెంపు
  • గ్రామీణ: రూ.2,500 నుంచి రూ.10,000కు పెంపు

కనీస నిల్వ లేనిపక్షంలో లోటు మొత్తంపై 6 శాతం లేదా రూ.500, ఏది తక్కువైతే అది అపరాధ రుసుముగా వసూలు చేయనున్నట్లు ఐసీఐసీఐ తెలిపింది.

ఇతర బ్యాంకులు కనీస నిల్వ ఛార్జీలు తగ్గిస్తున్న సమయంలో, ఐసీఐసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ₹50,000 పరిమితి చిన్న పొదుపుదారులకు భారమవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.