గాజులరామారంలో సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి: తాజోద్దీన్
సదాశివపేట, సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తాజోద్దీన్ పిలుపునిచ్చారు. మంగళవారం సదాశివపేటలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను పార్టీ నేతలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తాజోద్దీన్ మాట్లాడుతూ, ఆగస్టు 20 నుండి 22 వరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారావు మహారాజ గార్డెన్స్‌లో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లక్ష్మి, శివలీల, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment