కలెక్టరేట్‌లో ఏసీబీ సోదాలు… లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన మహిళా ఉద్యోగి

కలెక్టరేట్‌లో ఏసీబీ సోదాలు… లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన మహిళా ఉద్యోగి


వికారాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) మరోసారి తన దాడులతో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నా, అధికారుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు.

తాజాగా, ఆగస్టు 12న వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ వివరాల ప్రకారం—నవాబుపేట మండల పరిధిలోని రెండు ఎకరాల అసైన్డ్ భూమి విషయంలో తహశీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి, సుజాత మొత్తం ₹20,000 లంచం డిమాండ్ చేసింది. ఇందులో ₹5,000ను కలెక్టర్ సంతకం కోసం ఫైల్ పెట్టే ముందుగానే ఫోన్‌పే ద్వారా స్వీకరించగా, మిగిలిన ₹15,000 తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏసీబీకి “ఫ్రీ హ్యాండ్” ఇచ్చినట్లు సమాచారం. ఏ శాఖలో అయినా, ఏ హోదాలో అయినా అవినీతి సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేపట్టి, నిందితులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రజలు లంచం డిమాండ్‌కు గురైతే తక్షణమే సమాచారం అందించేందుకు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్, వాట్సాప్ నంబర్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.