తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీకి బెయిల్ మంజూరు
కరీంనగర్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన “లేడీ అఘోరీ” శ్రీనివాస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం స్థానిక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల జరిమానా చెల్లింపు తో పాటు, ప్రతి గురువారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని నిబంధనలు విధించింది.
ఈ ఆదేశాల ప్రకారం, శ్రీనివాస్ మంగళవారం జైలు నుండి విడుదల కానున్నాడు. గతంలో కొత్తపల్లికి చెందిన ఒక యువతి, తనపై అత్యాచార యత్నానికి శ్రీనివాస్ పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు నమోదు కావడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Post a Comment