తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించవద్దు...!
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప గ్రామంలో జరిగిన ఒక విషాదకర సంఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. పదో తరగతి చదువుతున్న చిన్నారిపై అదే గ్రామానికి చెందిన యువకుడు మనోహర్ (21) మాయమాటలు చెప్పి తన వలలోకి దింపాడు. ఏడాది రోజులుగా అతడు బాలికపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు.
ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో ఆమె తల్లిదండ్రులు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించగా బాలిక గర్భవతి అని తెలిసింది. అనంతరం బాలిక ప్రసవించి మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై, నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు మనోహర్‌పై పోక్సో చట్టం కింద దర్యాప్తు ప్రారంభించారు.
తల్లిదండ్రులకు హెచ్చరిక
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించడం అత్యంత అవసరం. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అన్న విషయాల్లో పర్యవేక్షణ ఉండాలి. ప్రతి కష్టం పిల్లల కోసమేనని గుర్తుంచుకోవాలి. లేకపోతే ఇలాంటి విషాదాలు జరుగుతూనే ఉంటాయి.
Post a Comment