గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలి

గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలి


జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ముఖ్య సూచనలు జారీ చేశారు.

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా తెలంగాణ పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్
లో నమోదు చేసుకొని అనుమతి పొందిన తరువాతనే మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఆన్లైన్ సమాచారం కేవలం మండపాల నిర్వహణ, భద్రత, పోలీసు బందోబస్తు ఏర్పాటుకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


గణేష్ ఉత్సవ కమిటీలు పాటించవలసిన ముఖ్య నియమ నిబంధనలు:

➡️ మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదే.
➡️ ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి.
➡️ నిర్దేశిత సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలి.
➡️ ప్రజా రవాణా, ట్రాఫిక్, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది లేకుండా మండపాలను ఏర్పాటు చేయాలి.
➡️ స్థల యజమాని మరియు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా పొందాలి.
➡️ మండప నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలి.
➡️ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10 గంటల తరువాత స్పీకర్ల వినియోగం నిషేధం.
➡️ మండపాల్లో, శోభాయాత్రల్లో డీజే వినియోగం పూర్తిగా నిషేధం.
➡️ మండపం వద్ద 24 గంటలు వాలంటీర్ విధుల్లో ఉండాలి.
➡️ భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలి.
➡️ అగ్ని ప్రమాదం నివారణకు ఇసుక, నీరు దగ్గరలో ఉంచుకోవాలి.
➡️ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట, అసభ్య నృత్యాలు, ఇతర మతాలను కించపరిచే ప్రసంగాలు/పాటలు నిషేధం.
➡️ పోలీసుల తనిఖీల కోసం "పాయింట్ పుస్తకం" తప్పనిసరిగా ఉంచుకోవాలి.
➡️ అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే Dial 100 ద్వారా సమాచారం ఇవ్వాలి.


జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సూచన:

“సామాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మవద్దు. సందేహాలు ఉంటే సంబంధిత పోలీసు అధికారులను లేదా Dial 100 నంబర్‌ను సంప్రదించండి” అని స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.