సినీ నటుడు కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి కన్నుమూత
హైదరాబాద్: ప్రఖ్యాత సినీ నటుడు, ఇటీవల మరణించిన కోట శ్రీనివాసరావు కుటుంబంలో మరొక విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి సోమవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా రుక్మిణి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే ఈ ఉదయం పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు. కుటుంబ సభ్యుల సన్నిధిలోనే హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి చెందారు. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు సమాచారం.
తెలుసుకున్నట్లుగా, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు జులై 13న కన్నుమూసిన విషయం సినీప్రియులకు తెలిసిందే. ఆయన మరణించిన నెలన్నర రోజుల్లోనే సతీమణి కూడా కన్నుమూయడంతో కోట కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కోట–రుక్మిణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ కోట ఏకైక కుమారుడు ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రసాద్ ‘సిద్ధం’, ‘గాయం 2’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. కుమారుడి మృతితో అప్పుడే కుంగిపోయిన కోట దంపతులు, ఇప్పుడు దంపతులిద్దరూ స్వర్గస్థులు కావడంతో కుటుంబం అంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది.
Post a Comment