ఏడు బావుల జలపాతం వద్ద విషాద ఘటన ప్రేమ్‌కుమార్ కోసం శోధన కొనసాగుతోంది.

 

ఏడు బావుల జలపాతం వద్ద విషాద ఘటన ప్రేమ్‌కుమార్ కోసం శోధన కొనసాగుతోంది.

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ప్రసిద్ధ ఏడు బావుల జలపాతం వద్ద శనివారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం జెన్నారం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ (23) స్నేహితులతో కలిసి జలపాతం దర్శనానికి వెళ్లాడు. అయితే, నీటిలో ఈతకు దిగిన సమయంలో ఒక్కసారిగా కనపడకుండా పోయాడు.

చీకటి పడటంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కష్టతరమవడంతో శనివారం రాత్రి శోధన విరమించాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి పోలీసులు, అటవీ సిబ్బంది, స్థానికులతో కలిసి శోధన కొనసాగించినప్పటికీ ఇప్పటివరకు అతని జాడ దొరకలేదు.

స్థానికులు చెబుతున్నదాని ప్రకారం, ఈ జలపాతం వద్దకు ఎక్కువమంది యువకులు పర్యాటకులుగా వస్తున్నప్పటికీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా ఈతకు దిగడం, లోతైన నీటిలోకి వెళ్లడం వలన తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.