"మట్టి చేతుల్లో – దేశప్రేమ హృదయాల్లో" – మిషన్ ప్లాంటేషన్ ఉద్యమం ముగింపు
గోదావరిఖని: "మట్టి చేతుల్లో దేశప్రేమ హృదయాల్లో" అనే శీర్షికతో జూన్ 26 నుంచి జూలై 27 వరకు నెల రోజులపాటు దేశవ్యాప్తంగా కొనసాగిన మిషన్ ప్లాంటేషన్ ఉద్యమం, స్థానిక అశోక్‌నగర్ ఉర్దూ మీడియం గర్ల్స్ హై స్కూల్‌లో ఘనంగా ముగిసింది.
నెల రోజులపాటు జరిగిన ఉద్యమంలో –
- గోదావరిఖని పట్టణంలోని వీధులు, పార్కులు, స్కూళ్లు, మసీదులు, ఇళ్ళ ప్రాంగణాలలో చిన్నారులు మొక్కలు నాటారు.
- నగర ప్రముఖులు, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యేలు, వైద్యులు, నాయకులకు మొక్కలు బహుకరించారు.
- వివిధ స్కూళ్ల విద్యార్థులతో డ్రాయింగ్, ఎలక్యూషన్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు డ్రామాలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వృక్ష సంపద ప్రయోజనాలను – పూలు, పండ్లు, ఆకు కూరలు, ఔషధ మొక్కలు, పక్షులు–జంతువులకు ఆశ్రయం, పర్యావరణ సమతౌల్యం వంటి అంశాలను చక్కగా వివరించారు.
ఆయిషా సిద్దిఖా మాట్లాడుతూ – “మొక్కలు నాటడం వల్ల కలిగే పుణ్యఫలం మనం లేని తర్వాత కూడా కొనసాగుతుందని, మహానుభావులు చెప్పినట్లు ఒక మొక్క వలన పశుపక్షులు, మానవులు లాభపడితే అది ధ్యానమే అవుతుందని” తెలిపారు.
ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం స్థానిక అధ్యక్షురాలు సాబెరా నాజ్, ఉపాధ్యక్షులు షాహెదా బేగం, సీఐఓ ఆర్గనైజర్ ఫహీమున్సీసా, ఆయేషా సిద్దిఖా, పెద్దపల్లి సీఐఓ అధ్యక్షురాలు మల్హెరి ఇరమ్, తాహిరా నాజియా, వివిధ పాఠశాలల అధ్యాపకులు ఫర్హీత్, తస్లీమ్, నాజియా, సనోవర్, పిల్లలు, తల్లిదండ్రులు, మంచిర్యాల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు హమీదా బేగం తదితరులు పాల్గొన్నారు.
Post a Comment