ఫుట్‌పాత్… రోడ్డు పక్కన మా బతుకులు
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు: మన సమాజంలో రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వస్తువులు అమ్ముకుంటూ బతుకుపెట్టుకుంటున్న వారి కష్టసుఖాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫుట్‌పాత్‌నే జీవనాధారం… అదే వ్యాపారం అన్నట్లుగా ఎండైనా, వానైనా నిలబడి కుటుంబాలను పోషించే పరిస్థితి ఈ పేదలది.
రోజూ ఉదయం సూర్యోదయం కాకముందే వీరు వస్తువులు సర్దుకుని రోడ్డు పక్కన నిలబడతారు. ఎండలో చెమటలు కారుతూనే, వానలో తడుస్తూనే వస్తువులు అమ్ముతారు. కానీ అమ్ముడు పోయినప్పుడే కడుపు నిండుతుంది. అమ్మకం లేని రోజుల్లో ఆకలి కేకలే కాదు… “చావు కేకలే వినిపిస్తాయి” అంటున్నారు.
“మా కన్నీళ్లు ఎవరు చూడరు… బేరం లేని నాడు రక్తపు కన్నీళ్లు వస్తాయి” అని మనసు విప్పారు. వస్తువులు అమ్మేటప్పుడు కొనమని ఎంత వేడుకున్నా, కొందరు ‘కసు బుసు’ అంటూ హేళన చేస్తారు. అయినా చిరునవ్వుతోనే వినమ్రంగా మరోసారి కొనమని కోరుకోవాల్సిందే.
తమకు ఎలాంటి ఆధారం లేదని, ఈ జీవనమే ఉన్నదని చెబుతూ ప్రభుత్వాన్ని ఆదరణ కోసం వేడుకుంటున్నారు. “ఫుట్‌పాత్ వ్యాపారులు బతుకుతున్నారు గాని, గౌరవం మాత్రం లభించడం లేదు. వీరిని ఆదుకోవాలి” అని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.
Post a Comment