ప్రతి ఇంటిపై తీరంగా — ఆనందఖని జడ్‌పి హైస్కూల్ ర్యాలీ

ప్రతి ఇంటిపై తీరంగా — ఆనందఖని జడ్‌పి హైస్కూల్ ర్యాలీ


పాత కొత్తగూడెం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా “హర్ ఘర్ తీరంగా” కార్యక్రమాన్ని పురస్కరించుకొని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆనందఖని విద్యార్థులు ఉత్సాహభరితంగా ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ జాతీయ పతాకాన్ని ఊపి ర్యాలీకి శ్రీకారం చుట్టారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో ఊరంతా ప్రదర్శన నిర్వహించారు. “ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేద్దాం”, “జాతీయ ఐక్యత – దేశ బలం” వంటి నినాదాలతో ప్రజల్లో దేశభక్తి జ్వాలను రగిలించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ  మాట్లాడుతూ,

“మన స్వాతంత్ర్యం అనేకమంది త్యాగధనుల ప్రాణ త్యాగాల ఫలితం. మనం దాన్ని కాపాడుకోవడం, గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత. జాతీయ పతాకం కేవలం ఒక వస్త్రం కాదు, అది మన గౌరవం, మన సార్వభౌమత్వానికి ప్రతీక” అని అన్నారు.

ర్యాలీలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, యన్‌సి‌సి అధికారి వీరు నాయక్, స్థానిక ప్రజలు పాల్గొని దేశభక్తి పట్ల తమ అంకితభావాన్ని వ్యక్తం చేశారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఇది ఆరంభం కావడంతో ప్రాంతమంతా దేశభక్తి వాతావరణంతో మార్మోగింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.