స్పెషలిస్ట్ క్యాంపుల్లో రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి – ఏఐటీయూసీ
కొత్తగూడెం, సింగరేణి ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత నేపథ్యంలో, కార్మికులు మరియు రోగుల అవసరాల కోసం విసిటింగ్ స్పెషలిస్ట్‌లను రప్పించాలన్న ఏఐటీయూసీ విజ్ఞప్తికి యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. అందువల్ల అన్ని ఏరియాల్లో స్పెషలిస్ట్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో, ఈ రోజు కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, మెడికల్ గ్యాస్ట్రో, యురాలజీ విభాగాల స్పెషలిస్టులు ఉదయం 8 గంటలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలస్యమయ్యారు. ఫలితంగా ఎల్లందు, మణుగూరు వంటి దూరప్రాంతాల నుంచి ఉదయం 8 గంటలకే వచ్చి నమోదు చేసుకున్న దాదాపు 200 మంది రోగులు, వారితో వచ్చిన వారు అల్పాహారం, భోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న సింగరేణి యాజమాన్యం రాబోయే క్యాంపుల్లో ఈ సమస్యలు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని, రోగుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల పరీక్షలకు సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉందని, కాబట్టి అల్పాహారం, భోజనం వంటి సౌకర్యాలు కల్పించాలని, అలాగే బయటినుంచి వచ్చే వైద్యులు ఉదయం 8 గంటలకే హాజరయ్యేలా చూడాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఒక ప్రకటనలో కోరింది.
Post a Comment