హెచ్‌ఎంఎస్ – జాగృతి సంస్థల మొదటి అలయన్స్ సమావేశం
హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఇటీవలే హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా చేరిన జాగృతి అధ్యక్షురాలు కవితల తొలి అలయన్స్ సమావేశం ఆదివారం జాగృతి కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఒకనాడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవంతో సింగరేణి బొగ్గుగనుల పటిష్టతను కాపాడటం, అభివృద్ధి దిశగా నడిపించడం తాము లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, తరుగని బొగ్గు నిధులు ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి కార్మికులకు అనేక సౌకర్యాలు కల్పించిందని, ప్రస్తుతం 560 కోట్ల రూపాయల లాభాలతో సింగరేణి ముందుకు సాగుతుందన్నారు. ఈ లాభాల్లో 30 శాతం కార్మికులకు రావాలని, ఇందుకు హెచ్‌ఎంఎస్ యూనియన్ తరపున పోరాటాలు చేపడతామని రియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.
సమావేశంలో రాష్ట్ర హెచ్‌ఎంఎస్ అధ్యక్షులు రియాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, తిప్పారపు సారయ్య, శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, కార్యదర్శి అశోక్, మణుగూరు వైస్ ప్రెసిడెంట్ కోడిపెల్లి శ్రీలత, ఆర్జీవన్ కార్యదర్శి క్రాంతి కుమార్, ఆర్‌జీ–2 కార్యదర్శి దావు రమేష్, అజీమ్ ఆయాజ్, ఆర్‌జీ–3 మమ్మద్ ఇస్మాయిల్, ఏఎల్పీ శాంతి స్వరూప్, గోశిక అశోక్, బెల్లంపల్లి నుండి సత్యం, రాజబాబు, మందమరి నుండి ఈ. శ్రీనివాస్, జి. శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం నుండి ఆంజనేయులు, ఆసిఫ్, కొత్తగూడెం కార్పొరేట్ నుండి గోడ రమేష్, ఎస్‌టిపి జైపూర్ పవర్ ప్లాంట్ ఆర్. విక్రమ్, సిహెచ్. ప్రదీప్ రెడ్డి, ఇల్లందు బాల ప్రసాద్, భూపాలపల్లి జూపల్లి మల్లేష్, నరసయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment