మియాపూర్‌లో ఐదుగురు మృతదేహాలు – ఒక్కసారిగా కలకలం

 

ఒకే ఇంట్లో ఐదుగురు మృతదేహాలు లభ్యమవ్వడంతో స్థానికులు భయాందోళన

హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ఐదుగురు మృతదేహాలు లభ్యమవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్తతో పాటు ఓ చిన్నారి కూడా ఉండటం మరింత విషాదాన్ని మిగిల్చింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ ఆర్థిక సమస్యలే కారణమా? లేక ఇతర వివాదాల వలన ఈ దుర్ఘటన చోటుచేసుకుందా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇల్లు లోపల మృతదేహాలుగా పడిఉండటం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

👉 పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.