భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు మొహీద్ పటేల్ సూచన


నారాయణఖేడ్ : పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు, న్యాయవాది మొహీద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లరాదని, ముఖ్యంగా పిల్లలను బయటకు పంపకూడదని ఆయన సూచించారు.

విద్యుత్ స్తంభాలు, తీగల సమీపంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలోని విద్యుత్ మరియు మున్సిపల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధంగా ఉండి, ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించిన ఆయన, వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించకుండా, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా, పట్టణంలోని నీరు వెళ్లే డ్రెయిన్ లైన్లను వెంటనే క్లియర్ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.