వరదల్లో చిక్కుకున్న వారిని భుజాలపై మోస్తూ కాపాడిన పోలీసులు
హైదరాబాద్, ఆగస్టు 27 : రాష్ట్రంలో వరద ముంపు ప్రభావం కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ ప్రాంతంలో వరదలో చిక్కుకున్న ప్రజలను పోలీసులు, SDRF సిబ్బంది భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర సహాయక చర్యల్లో భాగంగా ఒక్కో వ్యక్తిని భుజాలపై మోస్తూ సిబ్బంది చూపిన సేవా తత్పరత స్థానికులను కదిలించింది.
అటు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అప్పర్ మానేర్ వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. సాంకేతికతను వినియోగిస్తూ ఆహార ప్యాకెట్లు చేరవేయడంతో బాధితులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తోంది.
అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మొత్తం 504 మంది వరద బాధితులను రక్షించారు. సహాయక చర్యలు యథావిధిగా కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

Post a Comment