రాజీవ్ గాంధీ మెమోరియల్ ట్రోఫీ శ్రీ చైతన్య పాఠశాలదే

రాజీవ్ గాంధీ మెమోరియల్ ట్రోఫీ శ్రీ చైతన్య పాఠశాలదే


భద్రాద్రి కొత్తగూడెం సమీపంలోని హేమచంద్రపురం BKCA మైదానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో నిర్వహించిన రాజీవ్ గాంధీ మెమోరియల్ ట్రోఫీ–2025 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది.

ఫైనల్ పోరులో శ్రీ శారద విద్యాలయ స్కూల్ జట్టుపై శ్రీ చైతన్య స్కూల్ జట్టు 20 ఓవర్లలో 103 పరుగుల లక్ష్యాన్ని చేదించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యార్థులు జట్టు సమన్వయం, పట్టుదలతో మెరిసారు.

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొండపర్తి నరేష్ కుమార్ విజేతలతో పాటు రన్నర్స్ జట్టుకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు క్రీడలపై చిన్ననాటి నుంచే ఆసక్తి పెంపొందించుకుంటే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని ఆయన అన్నారు.

టోర్నమెంట్ కన్వీనర్లుగా మతిన్ (ఖమ్మం), పంతంగి సాయి నిరంజన్ (కొత్తగూడెం), నిర్వాహకులుగా బోయిని ప్రసాద్, మార్గం నరేందర్, పదిరి నర్సిరెడ్డి వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు, పీఈటీలు, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.