ట్రాన్స్ జెండర్లకు జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, హెచ్ఎండీఏ వంటి విభాగాల్లో సెక్యూరిటీ విధుల్లోకి
హైదరాబాద్: ట్రాన్స్ జెండర్ సమాజానికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నగరంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ట్రాన్స్ జెండర్లను ఇప్పుడు జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, హెచ్ఎండీఏ వంటి విభాగాల్లో సెక్యూరిటీ విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.
గత ఎనిమిది నెలలుగా ట్రాఫిక్ విభాగంలో అసిస్టెంట్లుగా పనిచేస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న ట్రాన్స్ జెండర్ల సేవలను మరిన్ని రంగాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వ విభాగాలతో పాటు, దశల వారీగా ప్రైవేట్ ఐటీ కంపెనీలలో కూడా సెక్యూరిటీ విధుల్లో నియమించే విధానం రూపొందించనుంది.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే ట్రాన్స్ జెండర్ సమాజానికి ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, సామాజిక గుర్తింపు మరింత బలపడనుంది.

Post a Comment