ఎం.పి. బంజారా పీహెచ్‌సీని అసిస్టెంట్ కలెక్టర్ ఆరోగ్య కేంద్రాల పరిశీలన
భద్రాద్రి కొత్తగూడెం, అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ ఈరోజు ఎం.పి. బంజారా పీహెచ్‌సీ పరిధిలోని లక్ష్మీపూర్ సబ్ సెంటర్‌ను సందర్శించారు. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల సేవలను ఆయన సమీక్షించారు. ఇంటింటికీ వెళ్లి వారు అందిస్తున్న ఆరోగ్య సేవలు, ఆన్‌లైన్ విధానాల అమలు గురించి వివరంగా తెలుసుకున్నారు.
తరువాత కృష్ణసాగర్ సబ్ సెంటర్ పరిధిలోని దేవయగుంపు గుత్తికోయల వాసాలను సందర్శించి, మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవల ప్రభావాన్ని అంచనా వేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పందన, డాక్టర్ సాహితి, డిపిఓ సలితతో పాటు పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment