కూకట్పల్లి చిన్నారి సహస్ర హత్యపై నిర్భయ ఆర్గనైజేషన్ ఆవేదన

కూకట్పల్లి చిన్నారి సహస్ర హత్యపై నిర్భయ ఆర్గనైజేషన్ ఆవేదన


హైదరాబాద్, కూకట్పల్లిలో 10 సంవత్సరాల చిన్నారి సహస్రను పాశవికంగా హత్య చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఐదు రోజులుగా ఈ సంఘటనతో తెలంగాణ ప్రజలు నిద్ర లేకుండా వేదన అనుభవిస్తున్నారని నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, న్యాయవాది మల్లెల ఉషారాణి పేర్కొన్నారు.

నిందితుడు "బ్యాట్ కోసం వెళ్లాను" అంటూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినా, అతను నిజమైన క్రిమినల్ స్వభావం కలిగినవాడని స్పష్టమైందని ఆమె తెలిపారు. ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి తక్షణమే కఠిన శిక్షలు అమలు చేయాలని, తద్వారా రాష్ట్రంలో మరికొందరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా అడ్డుకోవచ్చని ఉషారాణి డిమాండ్ చేశారు.

తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను చిన్నతనం నుంచే గమనించాలని, వారు స్కూల్‌లో, సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నారు, సెల్‌ఫోన్లను ఎలా వాడుతున్నారు అన్న విషయాల్లో నిత్యం శ్రద్ధ పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. "పిల్లలను కష్టపడి చదివించి పేరు, ప్రతిష్టలు సంపాదించేలా తీర్చిదిద్దాలి. లేకపోతే ఇలాంటి దారుణ సంఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉంది" అని ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.