11 జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక – ఆరెంజ్ అలర్ట్

11 జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక – ఆరెంజ్ అలర్ట్


హైదరాబాద్‌, సెప్టెంబర్ 28: తెలంగాణలో వర్షాలు ఆగేలా లేవు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో, వాతావరణ కేంద్రం ఈరోజు ఆదివారం 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

శనివారం ఇప్పటికే పలుచోట్ల వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపించింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్‌పల్లి గ్రామంలో ఇళ్లు నీటమునగడంతో 16 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రోడ్లు, వంతెనలపైకి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

👉 రైతులు, ప్రయాణికులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.